![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌజ్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది. మొదట్లో యావర్, ప్రశాంత్ లతో రతిక బేబీ సినిమాని రిక్రియేట్ చేసింది. ఆ తర్వాత శుభశ్రీ, గౌతమ్ ల మధ్య లవ్ ట్రాక్ మొదలైన కొన్ని రోజులకే ప్రేక్షకులు శుభశ్రీని బయటకు పంపించేశారు. ఇక హౌజ్ లో గ్లామర్ రోల్ ని పంచుకునే బాధ్యత ప్రియాంక, శోభా శెట్టి మీద పడిన వాళ్ళు ఇప్పటికే రిలేషన్ లో ఉండటంతో పెద్దగా వర్కవుట్ కాలేదు.
ఇక హౌజ్ లో లవ్ ట్రాక్ కోసం ఏకంగా అయిదుగురు కొత్త కంటెస్టెంట్స్ తీసుకొచ్చాడు. అయితే ఇందులో అంబటి అర్జున్ టాస్క్ ల మీద ఫోకస్ గా ఆడుతూ అమ్మాయిల జోలికి పోవట్లేదు. భోలే శావలి అందరికి బిస్కట్ లు వేస్తు కలిసి పోవాలనుకుంటున్నాడు. ఇక పూజా మూర్తి లావుగా ఉండటం వల్ల ఎవరు తనతో మాట్లాడటానికి సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించట్లేదు.
ఇక మిగిలింది అశ్విని శ్రీ, నయని పావని. వీళ్ళిద్దరు ఇప్పుడు గ్లామర్ డాల్స్ గా మారారు. అశ్విని శ్రీ తన గ్లామర్ ని చూపిస్తూ ట్యాలెంట్ చూపిస్తుండగా, నయని పావని తన సోషల్ మీడియాలో ఎలా ఉందో అదే పద్దతిని హౌజ్ లో ఫాలో అవుతుంది. దీంతో తనతో ఎవరైన పులిహోర కలపాలని అనుకుంటున్నారు. ఆ పులిహోర బ్యాచ్ లో యావర్ మొదటి స్థానంలో ఉన్నాడు.
నిన్నటి ఎపిసోడ్‌లో యావర్-నయని పావని మధ్య జరిగిన మాటలన్నీ పులిహోరని మించి సాగాయి. నయని నువ్వు సింగిలేనా అని యావర్ అడుగగా.. ఎందుకని నయని అంది. ప్లీజ్ చెప్పొచ్చు కదా అని యావర్ అనడంతో.. ఎస్ నేను సింగిల్ అని నయని అంది. దీంతో యావర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొన్నటి ఎపిసోడ్ లో శివాజీతో.. మా ఇద్దరి జోడి ఎలా ఉందని యావర్ అడుగగా.. బాలేదని శివాజీ అనడంతో డల్ అయిపోయాడు మనోడు. ఇక మనోడు మెల్లమెల్లగా నయని పావనితో ఎక్కువ సమయం కలిసి ఉండటం, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి తనతో పాటే ఉంటూ ఖాళీ దొరికినప్పుడల్లా బిస్కెట్లు వేస్తున్నాడు. యావర్-నయనిల మధ్య కొత్తగా మొదలైన ఈ లవ్ ట్రాక్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
![]() |
![]() |